బాల కృష్ణం వందే జగద్గురుం

బాల కృష్ణం వందే జగద్గురుం

       శ్రీ రామదాసు వారి రచన చంధస్సు


ప:: మృగరాజ జఘన గజరాజ గమన
      నగరాజ ధర నంద కిషోరా || మృగరాజ ||


చ1 : ఆవులించకనే       ప్రేవు లెంచే వాడు
        ఆవుల మందకు     కావలి యున్నాడు       || మృగరాజ ||

చ 2 : తల్లి కోపము చేసి      బుల్లి రోటిని కట్టే
          ఎల్ల జగముల రేడు    పిల్ల వాడైనాడు      || మృగరాజ ||

చ3: మెండైన వానలోన    నిండేడు దినములు
          కొండ వేలున మోసి    అండగ నిలిచాడు || మృగరాజ ||

చ 4 :కాళింది మడుగులో        కాళీయు నేళించి 
         కేళీ గా గరళంపు              తాళకి తుడిచాడు || మృగరాజ ||

చ 5 : దూత యై చనువాడు      గీత చెప్పిన వాడు 
           జాతి గుర్రము తోలి        ప్రీతి గా గాచాడు  || మృగరాజ ||

చ 6:    శ్రీ వైకుంఠము వీడి       ఈ వేంకటా గిరిని
             కోవెల కొలువున్నాడు    శ్రీ వేంకటేశ్వరుడు || మృగరాజ ||

No comments:

Post a Comment