లింగాష్టకం
బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ ।
జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥
దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ ।
రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥
సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।
సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥
కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥
కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగమ్ ।
సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥
దేవగణార్చిత సేవిత లింగం భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ ।
దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥
అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ ।
అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥
సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।
పరమపరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥
ఫలశ్రుతి:
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
**************************************
శివాష్టకం
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజమ్ ।
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 1 ॥
గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ ।
జటాజూట గంగోత్తరంగైర్విశిష్యం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 2॥
ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ ।
అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 3 ॥
వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్ ।
గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 4 ॥
గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాసన్ని గేహమ్ ।
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 5 ॥
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దధానమ్ ।
బలీవర్ధయానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 6 ॥
శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ ।
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 7 ॥
హరం సర్పహారం చితా భూ విహారం భవం వేదసారం సదా నిర్వికారం।
శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 8 ॥
ఫలశ్రుతి:
స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ ।
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి ॥
************************************************************************
విశ్వనాథాష్టకం [ కాశీ ]
గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 1 ॥
వాచామగోచర మనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం
వామేన విగ్రహ వరేణ కళత్రవం తం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 2 ॥
భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాజినాంబర ధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 3 ॥
శీతాంశు శోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 4 ॥
పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం దనుజ పుంగవ పన్నగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 5 ॥
తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపిరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 6 ॥
ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
ఉపే రతించ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రవేశం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 7 ॥
రాగాది దోష రహిత స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 8 ॥
ఫలశ్రుతి:
వారాణశీ పుర పతే స్థవనం శివస్య:
వ్యాసోక్త మష్టకమిదం పఠితా మనుష్య:
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ విలయే లభతే చ మోక్షమ్ ॥
విశ్వనాథాష్టకమిదం యః పఠేః చ్చివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే ॥
"ఉపే రతించ సునివార్య మనస్సమాధౌ" -- ఇక్కడ "పాపే" అని కొన్ని చోట్ల ఉన్నది. చందస్సు ప్రకారం ( UUI UII IUI IUI UU - ప్రతీ పాదం లో వచ్చే గణములు - వసంత తిలక వృత్తం ) అదే సరిగా అనిపిస్తున్నది.
కానీ మా తరాల పుస్తకం లో , బాలు గారు పాడిన చోట కూడా "ఉపే" ఉండుట వల్ల అదే రాయడం జరిగినది. విజ్ఞులు సరిచేయగలరు.
************************************************************************
బిల్వాష్టకం
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః ।
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ ॥
కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః ।
కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణమ్ ॥
కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణమ్ ॥
కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనమ్ ।
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణమ్ ॥
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణమ్ ॥
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః ।
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణమ్ ॥
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణమ్ ॥
రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా ।
తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణమ్ ॥
తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణమ్ ॥
అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనమ్ ।
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణమ్ ॥
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణమ్ ॥
ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ ।
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణమ్ ॥
సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః ।
యజ్ఞ్నకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణమ్ ॥
దంతి కోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ ।
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణమ్ ॥
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్ ।
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥
సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపనముచ్యతే ।
అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణమ్ ॥
అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తధా ।
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణమ్ ॥
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణమ్ ॥
Sivastuthi by Sri SP Balasubramanyam : నాలుగు అష్టకములు
Followed by MalliKarjuna Suprabhatam by . Sri PB Srinivas and Smt S. Janaki
శ్రీ శైల మల్లేశ్వర సుప్రభాతం
------------------------------
శివ పంచాక్షరి స్తోత్రం
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "న" కారాయ నమః శివాయ ॥ 1 ॥
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ ।
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై "మ" కారాయ నమః శివాయ ॥ 2 ॥
శివాయ గౌరీ వదనారవింద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ ।
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై "శి" కారాయ నమః శివాయ ॥ 3 ॥
వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది
మునీంద్ర దేవార్చిత శేఖరాయ ।
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై "వ" కారాయ నమః శివాయ ॥ 4 ॥
యక్షస్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ ।
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై "య" కారాయ నమః శివాయ ॥ 5 ॥
ఫలశ్రుతి
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
యక్ష అంటే పూజింపదగినవాడు.[ పూజాయాం యక్షయతే ]. ఇక్కడ ఐదవ శ్లోకంలో యక్ష స్వరూపాయ , యజ్ఞ స్వరూపాయ అని కొన్ని చోట్ల ఉన్నది.
పెద్దల వద్ద నేర్చుకున్నది "యక్ష" అనే కనుక అదే వాడటం జరిగినది.
-----------------------------




No comments:
Post a Comment