ప: పాదము మొపుమా పంకజ వాసిని
సాధన చేసెడి సాత్విక మనసుల నీ || పాదము ||
చ1: ఉదయారుణ పారాణి గని ఉదయాస్తములు నను విడిపొనీ
సదా గంధ పుష్ప గాలిని శ్వాసలను శుద్ది చెయనీ
మధుర సంగీత మంజీరపు ద్వని మనసులు నిండగ మ్రొగనీ
పద పల్లవములు తాకనీ పాప రాశినిక పూర్తిగా పొనీ || పాదము ||
చ2: వామాంకస్తిత జానకి రామాయణమున నాయకి
ప్రేమను లేఖ గ పంపిన రుక్మిణి ప్రేమతొ గెలిచెను కృష్ణుని
అమ్మా అలమేలు మంగా అల వేంకటా రమణీ
మమ్మాదరింపుము కరుణ మహ లక్ష్మీ || పాదము ||
ప్రేమను లేఖ గ పంపిన రుక్మిణి ప్రేమతొ గెలిచెను కృష్ణుని
అమ్మా అలమేలు మంగా అల వేంకటా రమణీ
మమ్మాదరింపుము కరుణ మహ లక్ష్మీ || పాదము ||
No comments:
Post a Comment