తెలుగు పద్య వృత్తాలు చందస్సు -- జంట వృత్తాలు

        తెలుగు పద్య వృత్తాలు  చందస్సు  -- "మత్తకోకిల" , "తరలము" అనే జంట వృత్తాలు.  

ఇంకా చాలా రకాల వృత్తాలున్నాయి. కానీ ఇంకో రెండు మాత్రం కొంత ప్రముఖంగా వాడ బడ్డాయి. 

ఇవి "మత్తకోకిల" , "తరలము" అనే జంట వృత్తాలు. 

మత్తకోకిల నడక చాలా సులభంగా వుంటుంది: 
                   "మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా"
                    "తాన తానన తాన తానన తాన తానన తాన తా" 
                      |_____ యతి మైత్రి __| 11 వ అక్షరం 

                 దీనిలో గణాలు : "ర స జ జ భ ర" 

 ఊహించినట్టే "తరలము" నడక
                        "నన తానన తాన తానన తాన తానన తాన తా" 
                          |_____ యతి మైత్రి ___|  12 వ అక్షరం 
దీనిలో గణాలు : "న భ ర స జ జ గ"  

   మత్త కోకిల గణాలు రాసి చూస్తే అది యెంత "symmetric" గా ఉందో అర్థమవుతుంది.
    కొంచెం నేర్పుగా రాస్తే ఈ వృత్తంలో "palindromes" రాయ వచ్చు! 

 Finally Review  : వృత్తాల నడక, గణాలు, యతి స్థానం
ఉత్పలమాల     తానన తాన తాన తన తానన తానన తాన తాన తా       భ ర న భ భ ర వ     10
చంపకమాల     తన నన తాన తాన తన తానన తానన తాన తాన తా     న జ భ జ జ జ ర     11
శార్దూలం     తానా తానన తాన తాన తననా తానాన తానాన నా           మ స జ స త త గ     13
మత్తేభం     తననా తానన తాన తాన తననా తానాన తానాన నా         స భ ర న మ య వ     14
మత్తకోకిల     తాన తానన తాన తానన తాన తానన తాన తా                    ర స జ జ భ ర     11
తరలము     తనన తానన తాన తానన తాన తానన తాన తా                 న భ ర స జ జ గ     12 

No comments:

Post a Comment