తెలుగు పద్య వృత్తాలు చందస్సు -- మత్తేభం
ఇది శార్దూలానికి "సహ-వృత్తం". నిజానికి చాలా వృత్తాలు ఇలా జంటగా ఉంటాయి.
ఒక దాని మొదటి గురువు రెండో దానిలో రెండు లఘువులవుతుంది.
అందు వల్ల దీని నడక:
"తననా తానన తాన తాన తననా తానాన తానాన నా"
|________ యతి మైత్రి _____| 14 వ అక్షరం
ఇంకో రకంగా రాస్తే:
"తక ధిత్తోం తక తోం న తోం న ధిరనా తద్ధిక్కు తద్ధిక్కు తా"
|______________ యతి మైత్రి ____| 14 వ అక్షరం
గణ విభజన చేస్తే
స భ ర న మ య వ
I U U U I I U I U I I I U U U I U U I U
తననా తానన తాన తా న తన నా తానా న తానా న నా
టూకీగా: మత్తేభం పద్యం 4 పాదాలలో
"స భ ర న మ య వ" అనే గణాలు వస్తాయి. 14వ అక్షరంతో యతి మైత్రి.
ఉదా:
అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై
(ఈ పద్యం పోతన గారు sorry శ్రీ రాముడే స్వయంగా రాసిన పద్యం "శ్రీమదాంధ్ర మహాభాగవతం" లోని
గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది)

No comments:
Post a Comment