శ్రీరామ నవమి శుభాకాంక్షలు
19 సీ : కస్తూరి తిలకము కలికితురాయి తో
అలరారు రామయ్య ఆత్రముగని
చిలక పచ్చని చీర చింతాకు పతకము
19 సీ : కస్తూరి తిలకము కలికితురాయి తో
అలరారు రామయ్య ఆత్రముగని
చిలక పచ్చని చీర చింతాకు పతకము
చిరునవ్వు మోముల సీత నొసగి
భద్రాద్రి నొకసారి భావాన మరుసారి
కళ్యాణమును చేసి కదము తొక్కి
పచ్చని పందిళ్ళ పానకంబులు తాగి
చలిమిడి వడపప్పు చక్క బెట్టి
తే : రాము లోరికి పెళ్ళి మా రాజు పెళ్ళి
సిరుల చక్కని తల్లి మా సీత యంట
వాన జల్లుగ మా రామ వరము కురియ
రామ జయ వెటుల జరిగె , రామ నవమి !
భద్రాద్రి నొకసారి భావాన మరుసారి
కళ్యాణమును చేసి కదము తొక్కి
పచ్చని పందిళ్ళ పానకంబులు తాగి
చలిమిడి వడపప్పు చక్క బెట్టి
తే : రాము లోరికి పెళ్ళి మా రాజు పెళ్ళి
సిరుల చక్కని తల్లి మా సీత యంట
వాన జల్లుగ మా రామ వరము కురియ
రామ జయ వెటుల జరిగె , రామ నవమి !
No comments:
Post a Comment