"స్నేహితుల " లక్షణం




23. కం || మన్నుకు   మానుకు   మధ్యన
               కన్నుకు   చూపుకు  నడుమన ,  కానని బంధం
              ఉన్నా లేకున్నా తన 
              ఉన్నతి  కోరుట  చెలిమికి,   ఉన్న  లక్షణం

    భావం : మట్టి ఎప్పుడు చెట్టు ఎదగాలనే కోరుతుంది ( చెట్లను పెంచండి)  ,
              కన్ను ఎప్పుడు చూపు కల కాలం వుండాలని కోరుతుంది ( నేత్ర దానం చెయ్యండి ) ,
              అలాగే ఏ పరిస్థితులలో ఐనా   "హితం" కోరడమే  "స్నేహితుల " లక్షణం...

No comments:

Post a Comment