అహం బ్రహ్మాశ్మి.

ఒక వ్యక్తికి ఒక కష్టం వచ్చింది ఐతే వెంటనే ఒక తెలివైన ఆలోచన వచ్చి ఆ కష్టం నుంచి తప్పించుకున్నాడు.
ఇప్పుడు ... ఒక సంశయం..ఆ తెలివైన ఆలోచనఎలా వచ్చిందా అని ....వేరు వేరు వ్యక్తులను అడిగాడు.

ఒక భక్తి కలిగిన వ్యక్తి చెప్పాడు ...అది దేవుడు ఇచ్చాడు నీకు అని....

మరొక వ్యక్తి , శాస్త్ర విజ్ఞానం ఉన్న వాడు ... ఇలా చెప్పాడు..నువ్వు ఇంతకు ముందు వేరు వేరు సందర్భాలలో
   వేరు వేరు అనుభవాలు గడించావు..అవి కొన్ని సఫలం అయ్యాయి ..కొన్ని విఫలం అయ్యాయి. ఇప్పుడు నీ
    నాడీ వ్యవస్త అవన్నీ క్రోడీకరించి ..  నీకు ఒక తెలివైన ఆలోచన ఇచ్చింది. అని చెప్పాడు..

ఒక గురువు వంటి వ్యక్తి వద్దకు వెళ్ళి ..వీరిలో ఎవరు చెప్పినది నిజం అని అడిగాడు. అప్పుడు ఆ గురువు ...ఇద్దరు చెప్పినది నిజమే అన్నాడు...
కొంత ఆశ్చర్యంతో ..ఎలా అని అడిగాడు ఈ వ్యక్తి...
అప్పుడు గురువు ఇలా చెప్పారు....నీకు రెండు వస్తువులు  తెలియవచ్చింది కదా ! .
.ఒకటి కష్టం లో ఉన్న నువ్వు ...రెండవది తెలివైన ఆలోచన ఇచ్చిన వస్తువు....
నిజానికి తెలివైన ఆలోచన కూడా నీ నుంచే వచ్చినది.
దానికి మేధస్సు అనో మనస్సు అనో నాడీ మండలం అనో పేరు పెట్టారు శాస్త్రజ్ఞులు..
కానీ అవేవీ కనిపించే రూపాలు కాదుగా...ఆ కనిపించని రూపానికి , ఆశ్చర్యముగా అద్భుతంగా అనిపించే ఆ రూపానికి...ఒక భక్తుడు దేవుడు అని పేరు పెట్టాడు.
 అదే ఆత్మ అని వెరొకరు అనవచ్చు.... ఆది నువ్వు గుర్తించ గలవు కానీ కర్మేంద్రియముల ద్వారా జ్ఞానేంద్రియముల ద్వారా వ్యక్తపరచలేవు... నిరూపించలేవు .

 నీలో జిజ్ఞాస వల్ల అదేమిటో ( తత్) ఇదేమిటో (త్వమ్) తెలుసుకోవచ్చు.

  అదే..ఆత్మ సాక్షాత్కారం..ఏదైతే నీ శరీర అవయవాలకు, దిశానిర్దేశం చేసే నీ బుద్ది కి  మెదడు కి దిశా నిర్దేశం చేస్తుందో అదే ఆత్మ , అదే దేవుడు.( అహం బ్రహ్మాశ్మి. ) ...

  ఆది అందరిలోనూ ఉంది కదా ...అది గ్రహించావా ..అని అన్నారు.

మన వాడు... గ్రహించాడు...ఇది "C" Programming ల్యాంగ్వేజ్ లో పాయంటర్స్ ..లాంటిది...
అర్థం కాక పోతే ..మళ్లీ మొదటి నుంచి చదవండి.... 

No comments:

Post a Comment