పద్యాలు -- సంకలనం

80:: శార్దూలము:

            ఆ విఘ్నేశుడు సిద్ధిబుద్దు లిడగా నార్బాటముల్ దగ్గగా,
            యావన్మందికి విద్య యన్న వసువే యార్జింప గర్వంబుగా,
             సేవాభావము వృద్ధి నొంది ధరలో సేద్యంబు పెంపారగన్ 
             శ్రీ విశ్వావసు నామవత్సరమిలన్ శ్రీ గూర్చి దీవించుమా!!! 

              వసువు అంటే ఐశ్వర్యము, విశ్వా వసు అంటే విశ్వానికి ఐశ్వర్యము.

ఆ వినాయకుని ఆశీస్సులతో ఐశ్వర్యము అంటే ఆర్భాటాలకు పోయేది కాదని, విద్య అనే ఐశ్వర్యం సాధించడం గర్వంగా మారే రోజులు రావాలని,( డబ్బు కన్నా విద్య కు విలువ పెరగాలి) అందరూ సేవాభావాన్ని పెంపొందించుకొని , వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఈ భూమిని దీవించాలని శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని కోరుకుంటున్నాం

79:  సీ :    ప్రాలేయ భానుడు ప్రాగ్దిశ నొప్పారె
                                     ర్వతాగ్రము జేర పాకినట్లు 
                  క్కగా గూర్చున్న లి రాజు, పొగ మంచు 
                                     భోగిమంటల జూసి సాగి పోయె 
                   చిలుకకై ధాన్యంబు సెట్టినా పుణ్యాత్ము 
                                     చిత్రగుప్తుల లెక్క చిక్కువెట్టె
                   సంక్షేమ సంతోష సంబరాలను గాంచి 
                                     లి రాజు ముదమంది యలుదేరె 

       ఆ:    కోడిపందెములకు, కొత్త బట్టలకును, 
                పిండి వంటలకును పేరు మోసి
                ధాన్యరాశినిచ్చి రహాసముల నింపు 
                సంకురాత్రి కిలను సాటి లేదు

      తూర్పున సూర్యుడు పర్వతం మొదలు నుంచి నెమ్మదిగా పర్వతం పై భాగానికి వెళ్తుంటే, ఒక చిన్నారి పర్వతం కింద నుంచి పై వరకు పాకినట్లుగా ఒక ఊహ గలిగింది. అలాగే చలి రాజుగారు, పొగమంచు గారు మంచి మిత్రులు. వీళ్లు తిష్ట వేసుకుని కూర్చుని ఉన్న సమయంలో భోగి మంటలు చూసి కొంచెం భయపడి వెళ్ళిపోతున్నారు. చిలుకలకు మరియు ఇతర పక్షుల కోసం ఒక ధాన్యం మూటని తన ఇంటి చూరుకు వేలాడ కట్టే రైతు యొక్క పుణ్యాన్ని చూసి చిత్రగుప్తుడు ఎంత పుణ్యం అని రాయాలో అర్థం కాక లెక్క తేలక చిక్కు పడుతున్నాడు. ఆనందదాయకమైన, అభివృద్ధి కారకమైన సంబరాలను చూసి రథం ముగ్గుల ద్వారా వచ్చిన బలి చక్రవర్తి మళ్ళీ రథంతో వెళ్ళిపోతున్నాడు. ఇది మన సంక్రాంతి... 
కోడిపందాలకు, కొత్త బట్టలకు, పిండి వంటల కు  బాగా పేరు మోసినదీ సంక్రాంతి. ఇండ్లలో ధాన్య రాశులు నింపి, మన రైతుల పెదవులపై చిరునవ్వులు కురిపించే ఈ సంక్రాంతికి సాటి అయిన పండుగ లేదు.. అందుకే మనం దీన్ని పెద్ద పండుగ అని కూడా అంటాం
       

78: ఆ:  రైతు నవ్వగలుగు రాజ్యమే రాజ్యము
            గోవు పెంపు చేయు గొప్ప రాజు 
            పాడిపంట లేని పసిడి భవన మైన
            పాడె మీద పెట్టు పాత శవము

77: కందం:

        రాకాసి రక్త బీజుడు
        నూకను దంచిన లభించు నొడ్డుగ నూకల్
        నాకిక మరణము లేదన
        నా కాళి నాళము పరచెను నంతము జేసెన్

        బియ్యాన్ని పగలగొడితే రెండు నూకలవుతాయి అలాగ
        నూకలని పగలగొడితే ఎక్కువ నూకలు అవుతాయి అనే ఉద్దేశంతో తీసుకున్నాను

76:  ఆటవెలది

            ఎవరు నాటి రచట ఏ ముహూర్తంబునన్ 
            ఎవరు పెంపు చేసి రవని లోన
            ఇంత యమృత ఫలము ఈరోజు తింటినే 
            వారి పుణ్యఫలము నోరులూర

             ఎవరు ఏ ముహూర్తంలో ఆ పెద్ద రసాల చెట్టుని అక్కడ నాటారో తెలియదు .. 
            ఎవరు నీళ్లు పోసి పెంచారో.. ఎవరు ఆ చెట్టుకి కాగితం చుట్టారు..
            కానీ ఈరోజు నేను ఆ అమృతాన్ని తినగలుగుతున్నాను కదా... వారందరికీ నా కృతజ్ఞతలు

75 :  లయ గ్రాహి

            ఈ పద్యానికి ప్రతి పాదంలో వరసగా ఏడుసార్లు భ ల (UIII)గణాలు వస్తాయి 
            తర్వాత రెండు గురువులొస్తాయి(UU) 
            ఒకటి మూడు ఐదు ఏడు గణములలో ప్రాస యతి వాడవలసి ఉంటుంది...

            లయ గ్రాహి 

            పూజలను సేయుటకు యోజనము దాటి విర జాజులును చంపక సరోజములు గూర్చున్ 

            రోజునొక బాపనుకు భోజనము పెట్టుటకు కాజయు మిఠాయిలు రివాజుగను దెచ్చున్

           మోజుపడు రాణులను గాజులను చీరల విరాజిత మనోహరి పరాజితను సేయున్

           రాజసము తోడ మరి తేజములు వారివిక భోజులగు మా తెలుగు రాజులకు జేజేల్

           శ్రీకృష్ణదేవరాయ రాజరాజ నరేంద్ర కాకతీయ రెడ్డి ప్రముఖ రాజులకు 
            వారు చేసిన తెలుగు భాష సేవకు ఒక పద్య పుష్పం


74.   క:  ఏలూర్ రైల్వే స్టేషన్
             తోలుచు నుండంగ వలయు దోమల నెపుడున్
              గాలాడదు యేమాత్రము 
              కాలాపక వూప వలయు, కాలం బెల్లన్

        ఒళ్ళు మండి కవిత్వం చెప్పడం అంటే ఇదే కాబోలు.


73. క:  సరిగమ పదనిస పలుకుల
            సి
రు లొలుకు చిరు నగవులను, చెలిమిగ నొసగే
            మరి మరి చిలవల పలవల
            సిరి గలుగు , ముది గలుగు , హరి , సిరి వరమిడగా


   నీ చిరునవ్వులతో సరిగమలు పలికితే... మేమె కాదు... శ్రీ హరి లక్ష్మీ దేవి కూడా మురిసి పోయి నీకు సంపదలు ఆనందాలు వరములు గా ఇచ్చుగాక !!

మీ వాడిని చూడగానే ..వచ్చిన పద్యం... కోటి శుభాలు కలగాలని ఆశీర్వదిస్తున్నా...

ఈ పద్యం లో విశేషం ఏమిటంటే.. అన్ని లఘువులే వుంటాయి.. ఛందస్సు కోసం రెండు గురువులు..ఉంటాయి... రెండు మరియు నాలుగు పాదాలలో చివరన
 
 
 72. క: అనయము  సొబగులొలుకుచును
            అనువగు పలు పరిచయములు , అనుభవములు గా
            మనసున భయములు తెలియక
            మనుము, చిరు నగవు లొలుకుచు, మా మాధవుడా
 
ఆశీర్వాద పద్యం...
 
ప్రత్యేకత: చిన్నవాడు అని అన్ని లఘువులు వచ్చేలా రాసాను... కంద పద్యం లో తప్పకుండా రెండు చోట్ల గురువు వాడి తీరాలి... మాధవ లో మా తప్పకుండా గురువు ఉండాలి.. కనుక...( పేరు మార్చకూడదుగా 😍)   ఆ మూడు అక్షరాలే గురువులు...

 

-

71.  క: తిరుపతి నిల మరకత పతి
             పరపతికి, సురపతికి మరి వరసతి పతియే
             సరియగు గతి...విరిశరపతి
            హరసతినుత మురహరి.. భవహరుడగు హరియే.... 

 తిరుపతిలో ఉన్న మరకత పతి..శ్రీ హరి,
పరపతి కావాలన్నా, సురపతి( ఇంద్రుని) కైనా...వరసతి( వరలక్ష్మీ) పతియే ( అంటే విష్ణువే) సరియైన గతి... అంతేకాదు... విరి శర పతి ( మన్మథుడు) ని హర ( హరించిన శివుడు ) ఆయన సతీమణి పార్వతీ దేవి... ఆమె చేత నుతింప బడిన విష్ణువు... ముర అనే రాక్షసుడు ని చంపిన విష్ణువు.. మన పాపాలు పోగొట్టే... విష్ణువే... ఈ ఇల లో తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి
 ------------------------
 
 
70. కార్తీక పౌర్ణమి...

        చ:  అలరుల బిల్వ పత్రముల, 
ర్చన సేయగ లింగ మూర్తికిన్
                తొలగెను సర్వ పాపములు, తోయపు ధారలు జారు రీతిగా
                వెలిగెను దివ్య తేజమది వెన్నెల కాంతులు మిన్ను తాకగన్
                నిలిచెను ఆత్మ రూపమది,నీవును నేనును ఏక మవ్వగన్ 

69. పావని హరీష్ లకు పెళ్ళి రోజు... శుభాకాంక్షలు...

ఉత్తమ జంట కు నాదొక.. ఉత్పల"మాల"

      ఉ:అప్పటి ఆది దంపతుల, ఆదర నొందెడు మేలు బుద్ధి యున్
           ఇప్పటి కొత్త జంటవలె, ఈడును జోడును నవ్వు మోమునున్
           ఒప్పెను తోడు నీడగను,ఓరిమి కూరిమి ఏక బంధమున్
           ఎప్పుడు మిమ్ము జూచి నను, ఏర్పడ దోచును నూతనత్వమున్
 
68: Happy birthday Naveen Brother...
     పుట్టినరోజు శుభాకాంక్షలు.... అన్న గారు...
     మీకోసం ఒక కంద పద్యం

      క:అన్నా యని పిలువగ నే
          నున్నా యని ముందు కురుకు, నుత్సా హముగా
          కన్నారు మన నేక దినము
         నన్నా నీ జన్మ దిన మునలరులు కురియన్
 
 67. Happy birthday my dear ... Rajkumar..
       క: కల్లలు ఎరుగని సాయము
            చల్లని చిరునవ్వు వంటి చక్కటి చెలిమిన్
            ఉల్లము ఝల్లన బహుమతి
            పల్లవ పంచక పరిమళ, పండుగ రోజున్
 
             కల్మషం లేని నీ సహాయానికి, 
            చిరునవ్వు లాంటి నీ స్వచ్ఛమైన స్నేహానికి సరితూగ గలిగేవి..
            పల్లవ పంచకాలు( మారేడు, తులసి, రావి, వేప, మామిడి) 
            ఈ చెట్లు ఎలాంటి మంచిని చేస్తాయో.. అలాంటి ది నీ స్నేహ గంధం...
            నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు
 
 
66**.    పుట్టినరోజు శుభాకాంక్షలు.... ramki...
          40 వ పడి లోకి శుభ స్వాగతం...
          నీకు.. నాకు.. సీసా.. అలవాటు లేక.  పంచుకోవట్లేదు... కాబట్టి.. నీకోసం ఒక

సీస పద్యం....

        పరుగుల వీరుని పెదవుల వీడని చిరునవ్వుల మోము, చంద్ర కాంతి
        విజయపు దారిని, వీడని  సమయస్ఫూర్తియే తనయెడ, సూర్య రాశి
        గగనపు దారుల ఎగసిన, పుడమిని వీడని బంధపు, వ్యోమ గామి
        కూరిమి చేసిన వారిలో నేరము లెన్నక మసలెడు లేత మనసు

        తే:   కలుగు గావుత సుఖముగా కలుము లెపుడు
                వెలుగు గావుత ప్రతిభల విద్య లెపుడు
                "వాణి" తోడుగా నిలువగా, వాని తోడ
                రామ భద్రుడు నినుగాచు! రామకృష్ణ!!
 
 
 
 65. క:: వచ్చిన పనియై పోయెను
            విచ్చిన కన్నుల పరవశ విష్ణువు పిలచెన్
            అచ్చట నారద తుంబురు
            
చ్చి కలువగ మురిసిరి, మా "బాలు" డినిన్
 
 
 
 
64. క:: మోహన గానపు మురళికి
            సాహస పదవుల నెరపిన , సహృదయునికిన్
            బహుముఖ సుగుణా ప్రతిభల
            ఇహమున శంకర గణముకు , ఇవియే జేజేల్ 

మోహన మైన గానము, అనితర సాధ్యమైన విద్యా ఉద్యోగ విజయాలు, పొరపొచ్చాలు లేని హృదయం,  వివిధ గుణాలలో ప్రతిభ గలిగి... ఇహములో మనకు తెలిసిన ప్రమధ గణముల వంటి శివ భక్తునికి.... ప్రేమతో మా బాబాయి గారికి... పుట్టినరోజు జేజేలు...
 
 
63.
     క:: పచ్చని కొమ్మల మాటున
          వి
చ్చెను చిరునవ్వు లొలుకు, విరిసిన కుసుమం
          వచ్చెను ముత్తెపు వాన
          స్వచ్ఛపు తెలుపులను మేన, సదమయ వదనం
 
 
62.
My telugu teacher
ఆ: తెలుగు పద్య ములను తేనెలూర గ నేర్పు
       ఆది గురువు మాకు ఆరు నందు
       భాష యందు పటిమ,భావింప భారతి 
       మానవతను నేర్పు మంచి మనసు

-----------------------------
61. 
లెక్కలు teacher
క: సూర్యా రావను పేరును
      ఆర్యా వర్తము నెచటకు అరిగిన మరువం
     కార్యాలయమున మాకా
     చార్యా మీ కృప గణితపు  చదువులు గాచున్
-----------------
60. 
My drawing master
ఆ: చిత్ర లేఖనమును చిటికెలో నేర్పించు
       అంద ముగను బడిని సుందరించు
       మొదటి చిత్ర పటము మెచ్చుకున్న గురుతు
        జర్నలిస్టు వీరు జాతి కొఱకు
---------------------------
59.    పక్కిల్లు తగుల బడినను
         చక్కటి నా ఇంటి కేమి జరుగదు యనెడిన్ 
          మిక్కిలి బద్ధక రోగుల
         మక్కెలిరగగొట్టు తన్ను మనుజాధములన్

58.  ఉ: చల్లని నీట తానమన చక్కగ జారెడు దేహ భీతునిన్
              అల్లన పాము ఉన్నదన ఆవల బోవని ధీరవంతునిన్
              ఆలికి చీర నిచ్చుటకు అంగడి కేగని లుబ్ధ బుద్ధునిన్
               ఏలవ మంత మంచిగొని ఏర్పడ గావుము నీదు భక్తునిన్


57 .   ఆ: చుట్టరికము మనకు చుట్టపెట్టె నగవు
               తెలుగు కలిపె మనసు తేనె లూర
               పద్యమొకటి రాయ పరవసించెద నేను
               జన్మదినము నాడు జగతి మురియ

               వరుసకు తాత గారి కి ...జన్మ దిన శుభాభినందన వందనములు


56.  ఆ:  గుండు సూది దిగదు బండ రాయి ని గుచ్చ
              మనసు లోకి పోదు మంచి మాట 
              వినెడు వాడు లేడు విన్నపములు చేయ
               తన్ని చెప్ప వలయు తమసు లకును

55.    ఆ:  కోడి పందెమనగ, కొత్త ధాన్యము రాగ
                బొమ్మలకు కొలువులు, భోగిపళ్ళు
                గంగిరెద్దు లాడె గడప ముంగిటి లోన
                మకర సంకురాత్రి మరల వచ్చె


54.    ఆ:  అమ్మ చేతి అరిసె, అరుదైన చక్కిలం
                 కోరి వండి పెట్టు కూర లనగ
                 ఎందు కంత తీపి ? ఎరుకగా చూచిన
                  
అమ్మ నెనరు కూర్చు కమ్మ దనము

53.     క:  అమ్మా! నీ బొమ్మ ల కను
               "కొమ్మ"లు కాలెడు చరితలు , కోకొల్లలుగా
                రమ్మా ఇకనైన ఇలకు
                బమ్మాoడము నేలు వనిత, భద్రత కేడ్చేన్

 
52.     క: ఏలిక పదముకు చేటిక
              పోలిక లేదిక చరితను పూర్వo బెపుడున్
              చాలిక పొమ్మను వానిక
              తేలికగా తెలుగు చూచు, తిత్తిరి గానిన్

51.   ఉ: కాగడ నూనె బిందువులు కారిన మాదిరి ఎంతగేడ్చినన్
              మీగడ పాలు తాగుచును మేడల గోడల దూగు చున్ననూ
              'రాగము భేద భావములు' రాలెడు దేహపు రోత భీతిగా
               "కాగిన జన్మ" సత్యములు కానగ జాలును ఏక రీతిగా

50.     క:  భారత దేశపు భవితను
                కూరిమితో చక్కదిద్దు, గురుతర కార్యం
                 పరిపక్వము గావించెడి
                 గురువుల మొక్కెదను నాదు, గుణములు మీరన్



49.    క: అల్లరి పిల్లల నైనను
               మెల్లగ తమదారి తెచ్చి, మోదము మీరన్
               ఉల్లము తాకగ నేర్పెడు
              చల్లని గురువునకు నేడు సన్మానంబుల్ 


48.    క: చదువులు నేర్పిన గురువులు
              బదులుగ నేమియు నడుగరు భారపు రుసుముల్
              ముదమగు బహుమతి గురువుకు
              బదులుగ నీయంగ వలయు, భారత భవితన్  

47.    కం:  అక్కకు తోడగు తమ్ముడు
                  పక్కన బలముగ నిలచెడు బావా మరుదుల్
                  చక్కని చెల్లికి అన్నలు
                  ఇక్కడి అనుబంధమన్న, ఇహ సంపదలే

46**.  ఆ:   పడవ  లోన నీరు  పడవను ముంచును
                   వస్తు వింట చేర వింత బరువు
                   తివిరి తీయ కున్న దుష్టపు యోచన
                   నీదు మనసు చేరి నిన్ను మింగు

45.   క:   తొలకరి జల్లులు కురియగ
               పులకించిన నెమలి మేను, పురి విప్పంగా
               జలజల వర్షపు దారుల
               ల కులుకుచు విడిచిరి కాగిత పడవల్

44.   ఉ:   నీలపు ఛాయ మేనియును నిండగు జుత్తున   కేకి పింఛమున్
                వేలున అగ్ని చక్రమును వేణువు పట్టిన వామ హస్తమున్
                ఆలము తాను చేయకను ఆలన చేసేడు లోకపాలకున్
                వాలిన భక్తి మొక్కెదను వానికి ధర్మ రక్షాభయానికిన్

43.   ఉ:  గోవుకు మేత పెట్టుటయు , గోవుల సాకుట గొప్ప పుణ్యముల్
               గోవుల పాలు గుండిగలు , గోవుల నేతులు దైవ పాత్రముల్
               గోవుల పూజ చేయుచును,  గోవుల తోకల నెత్తి మొక్కుచున్
               గోవుల పాలు లేగలకు గుక్కెడు నీయరు చిత్రమీ జనుల్ 

42. ఆ:   ఇంటి పనుల లోన ఇందిరమ్మ కు తోడు
              మామ గారి కేమొ మరొక తనయ
              పిల్లలందు నెనరు , ప్రియమైన నేస్తము
              మనసు గెలుచు తరుణి మా పవిత్ర

               పవిత్ర కు పుట్టినరోజు శుభాకాంక్షలు


41. ఆ:  ఆకురాయి కాదు అవమానములు పెంచు
              ఆయుధంపు పదును అవని లోన
              గౌరవంబు పెంచి పౌరుషంబు విడుము
              మాట తూల రాదు మనుజులెపుడు

40.  ఆ: మండు వేసవందు మామిడి నంజుకు
             ఆవకాయ రుచులు ఆరగించి
             మరల పెరుగు లోన మామిడి రసమును
             జేర్చు కొనుట గాదె జీవితంబు

39.  ఆ: పలక పై బలపము పట్టి రాసేవేళ
              పాలబలపమున్న చాలగొప్ప
              బాగ చదువు వాని బాధితులెందరు
              చిన్న నాటి చెలిమి చెరిగి పోదు

38.  ఆ: చదువులెన్ని గాని చదవంగ వచ్చాము
              గుసగుసల పలుకుల గొణిగి నాము
              గురువు కోపగించ గుంజీలు తీశాము
               బాల చెలుములెపుడు బాసి పోవు

37.  ఆ: చిన్న తనము లోన చేయిచేయి కలిపి
              చీకిలేటు తినుచు చేరినాము
              బడికి నడుచు దారి బంధమ్ము వేసింది
               బాల చెలుములెపుడు బాసి పోవు

36.   ఆ: మంచి మాట పంపు మార్నింగు వాట్సాపు
               పగలు రేయి లేదు పంపుతుండ్రు
               చెప్పు వాడు గాక చేయువాడెవడు రా
               పలుకు నీతులన్ని పరులకేను

35.   ఆ: కలసి మెలసి చేయు కార్యమే కార్యము
               కలవలేని మనసు కలుషితమగు
               ఒకరికొకరు చేరి ఒక్కరై నిలచిన
               వేల జనుల రూపు విశ్వ రూపు

34.   ఆ: చుక్క వేరు పడెను నొక్కటే కడలిలో
               ఉప్పు రూప మొందె ఉడికి మఱిగి
               అలలు లాగు కొనగ అది నీట కరిగేను
               జీవ దైవ తత్వ జీవనమ్ము

33. ఆ: మంచి మాట కిపుడు మనుగడే లేదంచు
             చెడును మరిగె మనిషి చిత్ర ముగను
             మంచిచేసి చూపు మర్యాద పరులను
             సంఘటితము చేసి చక్క దిద్దు

32.  క: జనులే కావలి ఉందురు
           జనులే యుద్ధములు చేయు, జనసైనికు లై
           జనహిత మెరుగని నేతల
           జనులే చెంపలు చరచు నిజమ్మీసరికిన్

31.క :పొగడక పొట్టలు నిండుచు
          జగములు మురియగ విరివిగ , జల్లులు పడుచున్
         మగువలు మన్నన నేరిచి
         నగవుల సాగెడు దినముల, నడుగు వికారీ

30. క: కుక్కుట పల్లెకు ఉదయం
           మిక్కిలి జీరల వెలిగెను,మిత్రుని రూపం
           చిక్కనగు చెలిమి ఫలముల
           చక్కని సంక్షిప్త మైన , ఛాయా చిత్రం

            on 26-Feb-2019 on Vani's good morning picture from their balcony
            మిత్రుడు అంటే సూర్యుడు


29. క:   దిన దిన  మాందోళన తో
            దిన ఫలములు చూచు కొనుచు , తిప్పలు పడుతూ
            దినపత్రిక చేతను గొని
            దినమొక యుగముగ గడుపుట  దీనము గాదే 

   
28. క:  వెన్నెల కురియని పున్నమి
            కన్నీళ్ళ కు నైన కొంత కరగని మనసున్
            మన్నన లొందని ధనములు
            ఉన్నా లేకున్న ఏమి ఉపయోగము రా


27:  క: పువ్వా ఎందుకు తొందర
            ఇవ్వేళపు ఉదయ సంధ్య , ఇంకను రానీ 
            నవ్వులు రువ్వుచు విరియకు
            అవ్వేళ వరకు పనులకు అందరు పోనీ 


26 :  తే ||    పాదము వదలని పరమ భక్తి గాంచి
                   చేతులారగ రావణు చేర దీయ
                   మస్తకము శివ హృదయ మంటి నంత
                   రావణుని ముద్దు లాడెను రాఘవుండు


 25: తే:    తెలుగు వలదను తల్లుల   తీరు మారు
                అమెరికాల కు పరుగులు   అంత రించు 
                ఆవు ఆవకాయవధాన  ఆశ పెరుగు
                హేలగా నిజము నెరిగించు హేవిళంబి 

     ధన్య వాదాలు ...హేవిళంబి నామ సంవత్సర "ఉగాది " శుభాకాంక్షలు







No comments:

Post a Comment