--------------------------------------------------
ఇంద్ర గణాలు: నల, నగ, సల, భ, ర, త
నల : I I I I
నగ : I I I U
సల : I I U I
భ : U I I
ర : U I U
త : U U I
సూర్య గణాలు: గల, న
గల : U I
న : I I I
------------------------------------
సీస పద్యాన్ని ఒకే లాగా ఉండే నాలుగు పెద్ద పాదాలుగా కానీ (1, 1, 1, 1),
ఈ ఒక్కో పెద్ద పాదాన్ని రెండు చిన్న పాదాలుగా (1, 2, 1, 2, 1, 2, 1, 2)
మొత్తం ఎనిమిది పాదాలుగా కానీ వివరించవచ్చు.
సీస పద్యంలో భాగం కాక పోయినా సాధారణంగా సీస పద్యం తరువాత ఒక గీత పద్యం
("ఆటవెలది" లేదా "తేటగీతి") వస్తుంది.
1. ఒక పెద్ద పాదంలో వరుసగా 6 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలూ వస్తాయి.
2. ప్రాస నియమం లేదు.
3. యతి 1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోనూ ( 1.1 - 3.1 ) ,
5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోనూ ( 5.1 - 7.1 )
మైత్రి కుదరాలి.
4. ప్రాసయతి ఉండ వచ్చు.
అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు
రెండో అక్షరాలు ప్రాస నియమం పాటిస్తే చాలు - అంటే ఒకే అక్షరం అయి ఉండాలి
(ఏ గుణింతమైనా సరే).
ఈ అచ్చ తెనుగు పద్య రీతులలో ఖచ్చితమైన గణాలు చెప్పక పోవటం వల్ల
అన్ని పద్యాలు (అంతెందుకు ఒక పద్యంలోని అన్ని పాదాలూ) ఒకే లయలో ఉండనవసరం
లేదు. కానీ వీటి లయను గుర్తించడం అంత కష్టం కాదు. పద్యాలు పైకి
చదువుతూ ఉంటే లయ దానంతట అదే అవగతం అవుతుంది.
ఉదా:
సీ. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర
దీపాలు గగనాన త్రిప్పలేక
జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు
మామూలు మేరకు మడవలేక
పని మాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె
గడియారముల కీలు కదపలేక
అందాలు చింద నీలాకాశ వేదిపై
చుక్కల మ్రుగ్గులు చెక్కలేక
తే.గీ ఎంత శ్రమ నొందుచుంటివో యేమొ స్వామి!
అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన;
గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు
అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను
( కరుణశ్రీ - జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మధుర
మధురంగా భగవంతుని కర్పించిన హృదయ పుష్పాంజలి ఇది!)
1 2 3 4 5 6 7 8
త త త సల త సల గల గల
UUI UUI UUI IIUI UUI IIUI UI U I

లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక
|_ప్రాసయతి__| |_ యతి______|
పై ఉదాహరణలో ప్రాస యతి ఉన్న అక్షరాలకు ప్రాసతో బాటు యతి కూడా కుదిరింది.
ప్రాస యతి అక్షరాలకి యతి మైత్రి అవసరం లేదు. ఇంకొక ఉదాహరణ చూడండి.
నగ సల నగ ర నల త న న
IIIU IIUI IIIU UIU IIII UUI III III
కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో లతలకు మారాకు లతికి యతికి
|____ప్రాస యతి__| |__యతి మైత్రి___|
ఇక్కడ ప్రాస యతి ఉన్నది కానీ "లి" కి "లు" కి యతి మైత్రి లేదు.
No comments:
Post a Comment