తెలుగు పద్యం చందస్సు -- కంద పద్యం

తెలుగు పద్యం చందస్సు  -- కంద పద్యం

  కంద పద్యం అందం ఇంతా అంతా కాదు. అతి సుందరమైన పద్య రీతులలో కందం ఒకటి. 

1. కంద పద్యంలో
   "గగ"( UU), "భ" (UII), "జ" (IUI), "స"(IIU), "నల" (IIII)
   అనే గణాలు వస్తాయి. గమనిస్తే అన్నీ 4 మాత్రలు కల గణలే!

2. కందంలో 1,3 పాదాలలో 3 గణాలు, 2,4 పాదాలలో 5 గణాలూ వుంటాయి.

3. బేసి (అంటే odd number) గణం "జ" గణం కారాదు.  
   అంటే 1,3 పాదాలలో 1,3 గణాలు,  2,4 పాదాలలో 2,4 గణాలు
   "జ" గణం కాకూడదు.

4. 2,4 పాదాల అంతంలో "గురువు" ఉండాలి. 
   అంటే ఈ పాదాలలో 5వ గణం "గగ" లేదా "స" అయి ఉండాలి.

5. ప్రాస నియమం పాటించాలి. ప్రాసయతి పనికి రాదు.

6. యతి మైత్రి 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ, నాలుగో గణం
   మొదటి అక్షరంతో కుదరాలి.

7. అన్ని పాదాలలో మొదటి అక్షరాలు అన్నీ హ్రస్వాలు గాని, అన్నీ దీర్ఘాలు
   గానీ అయి ఉండాలి.

8. 2,4 పాదాలలో 3వ గణం "జ" కానీ "నల" కానీ అయి ఉండాలి. 

చూడటానికి చాలా strict గా అనిపించినా, కందంలోని గణాలన్నీ నాలుగు మాత్రల గణాలు కావటం వలన పద్యం లయ పట్టుకోవటం చాలా తేలిక.
ఒక సారి కంద పద్యం లయ  అలవడితే పద్యాలు వాటంతట అవే ఈ సూత్రాలకు అనుగుణంగానే వస్తాయి.
సుమతీ శతక పద్యాలు అన్నీ కంద పద్యాలే. 
మీకు వచ్చిన పద్యాలను నెమరు వేస్తూ లయ బద్ధంగా చదవటానికి పైకి చదువుతూ సాధన చేస్తే పద్యాలు చదవటం, రాయటం, గుర్తుంచుకోవటం
తేలిక అవుతాయి! 

No comments:

Post a Comment