తెలుగు పద్యం చందస్సు -- తేటగీతి - ఆటవెలది
ఈ రెండు పద్యాల గణాలను ఒక ఆటవెలది పద్యంలో చెప్తారు:
సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు
దినకర ద్వయంబు తేటగీతి
ఇన గణ త్రయంబు ఇంద్ర ద్వయంబు
హంస పంచకంబు ఆటవెలది
తేటగీతి:
అన్ని పాదాలలోనూ 1 సూర్య గణం, 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వస్తాయి.
ఆటవెలది:
1,3 పాదాలలో : 3 సూర్య గణాలు, 2 ఇంద్ర గణాలు
2,4 పాదాలలో : 5 సూర్య గణాలు
గీత పద్యాలు రెండిటికీ common సూత్రాలు
1. ప్రాస నియమం లేదు
2. యతి మైత్రి మొదటి గణంలో మొదటి అక్షరానికి, 4వ గణంలో మొదటి అక్షరానికి ఉండాలి.
3. ప్రాస యతి ఉండవచ్చు.
వేమన పద్యాలు అన్నీ ఆట వెలది పద్యాలు.
సీస పద్యం చివర ఉన్నది ఒక గీతి పద్యం.
తేటగీతి - ఉదాహరణ:
తివిరి ఇసుమున తైలంబు తీయ వచ్చు,
దవిలి మృగతృష్ణలో నీరు త్రాగ వచ్చు,
తిరిగి కుందేటి కొమ్ము సాధించ వచ్చు
చేరి మూర్ఖుని మనసు రంజింప రాదు
(ఇది పైడిపాటి "ఏనుగు" లక్ష్మణ కవి తెనిగించిన భర్తృహరి సుభాషితాల లోనిది)

No comments:
Post a Comment