తెలుగు పద్య వృత్తాలు చందస్సు -- చంపకమాల
ఇది ఉత్పలమాలకి సహ-వృత్తం అని చెప్పవచ్చు.
దీనికీ ఉత్పలమాలకీ ఉన్న ఒక్కటే తేడా ఏంటంటే ఉత్పలమాలలోని మొదటి గురువు,
చంపకమాలలో రెండు లఘువులవుతుంది. "దాశరధి" శతకం గమనిస్తే ఇది అర్థం అవుతుంది
అంటే ఉత్పలమాల నడక
"తానన తాన తాన తన తానన తానన తాన తాన తా" అయితే
|____ యతి మైత్రి ____| 10 వ అక్షరం తో
చంపకమాల నడక
"తన నన తాన తాన తన తానన తానన తాన తాన తా"
|______ యతి మైత్రి _____| 11 వ అక్షరం తో
(షరా: మీకిష్టమైతే దీన్నే "ధిరనన ధీం న తోం న నన ధీం తక తోం తక ధిక్కు ధిక్కు ధా" అనీ రాసు(నేర్చు)కోవచ్చు)
ఈ నడకను కూడా మూడు మూడు అక్షరాలుగా విభజించి గణాలు గుర్తిస్తే
న జ భ జ జ జ ర
I I I I U I U I I I U I I U I I U I U I U
తనన న తాన తాన త న తాన న తాన న తాన తాన నా
టూకీగా చెప్పాలంటే:
చంపకమాల లో 4 పాదాలలోనూ "న జ భ జ జ జ ర" గణాలు వస్తాయి, 11వ అక్షరంతో యతి మైత్రి.
ఉదా:
అలుగుట యే యెఱుంగని మహా మహితాత్ముడజాత శతృవే
యలిగిన నాడు సాగరములన్నియు నేకము కాక పోవు క
ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజ రాజ నా
పలుకుల విశ్వసింపుము విపన్నుల నార్తుల గావుమెల్లెడన్
(ఇది తిరుపతి వేంకట కవుల "పాండవోద్యోగ విజయాలు" లోనిది. కౌరవ సభలో రాయబార సందర్భంలో కృష్ణుడు ధృతరాష్ట్రునితో చెప్పినది.)
పై పద్యాన్ని చంపకమాలకి చెప్పిన నడకలో చదువుకొని సరిగా ఉన్నదో లేదో చూసుకోండి.
ఆ తరువాత అన్ని పాదాలనూ గణ విభజన చేసి గణాలు సరిపోయాయో లేదో గమనించండి.
ప్రాసాక్షరం : ల (నాలుగు పాదాలలో వరుసగా "లు, లి, లు, లు")
యతి: (మొదటి అక్షరానికీ 11వ అక్షరానికీ చూస్తే: )
1. "అ" -- "హా"
2. "య" -- "ల"
ఇవి రెండు కూడా నిజానికి ఒక యతి మైత్రి వర్గానికి చెందినవి కావు.
కానీ గమనించి చూస్తే ఇవి రెండూ సంధి వల్ల మారురూపంలో ఉన్న "అ" లు.
"యలిగిన" = "య్ + అలిగిన" , "లన్నియు" = "లు + అన్నియు" కాబట్టి
యతి మైత్రి "అ" -- "అ" కి సరిపోయింది.
3. "ర్ణు" -- "నొ"
"ర్ణు" లోని "ణు" గ్రహిస్తే యతి మైత్రి తేలికగా కనిపిస్తుంది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే "ణ" కి "న" కి మైత్రి కుదరటమే కాక,
వాటిని అంటి ఉన్న అచ్చులు "ఉ" కి "ఒ" కీ కూడా మైత్రి కుదిరింది.
4. "ప" -- "ప"

No comments:
Post a Comment