భాగవతము నేర్పు భక్తి మనకు


ప్రార్థన పద్యం

క:    శ్రీవిఘ్న గణపతి పదము
        లేవిఘ్నము కలుగకుండ,ఏర్పడ కొలుతున్
        శ్రీవిజ్ఞానము మనసున
        ఆవిర్భావము కలుగగ ఆనతి నొసగన్

క:  అమ్మా ! పసగల పదముల
      నిమ్మా హరికీర్తి నుడువ, నీ వరములుగా
      గొమ్మా ప్రణతులు భారతి
      అమ్మా ఆశీర్వ దించు అణకువ మెలగన్

క: ఇలపై నడిచిన శంకరు,
     కలియుగ శుక బంధు మాదు, గణపతి గురువుల్
     తెలుగునకు "గరికి పాటి" ని
     తలపున మొక్కుదును వారు , దయ దీవించన్


మొదటి ప్రార్ధన....

     ఆ:శ్రీనివాస పాద శరణు వేడి తొలుత
           రామనామ మధుర రసము నెరిగి
           నారసింహు మొక్కి వారి దీవెనలంది
           శతక పద్య రచన సలుపు చుంటి

పోతన గారిని వారి సూక్తిని మదిలో ఉంచుకుని

     ఆ: శివుని పూజ చేయ శివ సన్నిధిని పొందు
            విష్ణు కీర్తి నుడువ విష్ణు చేరు
            సత్య దయల బుద్ది సర్వము సాధించు
            భాగవతము నేర్పు భక్తి మనకు


శతకము

గజేంద్ర భక్తి

1. ఆ:   విహ్వల గజరాజు వేదన పరిమార్చు
           శరణు ఘోష చేయ , వరదుడతడు
           దిక్కు లెన్ని వున్న దేవుడే మిన్నగా
           భాగవతము నేర్పు భక్తి మనకు

          దిక్కు లేని వారికి దేవుడు దిక్కు కాదు... ఎంత మంది వున్నా.. దేవుడే నిజమైన దిక్కు..

-----
అంబరీషు భక్తి 

2. ఆ:   నిష్ఠ నిలిపి నిన్ను నియమము తో కొల్వ
            నిరతము మము గాచు, నేస్త మీవు
            అంబరీషు వెనుక ఆపన్న చక్రమై
            భాగవతము నేర్పు భక్తి మనకు

 -----
రుక్మిణీ భక్తి

3. ఆ:    ఆ ఉమా మహేశు లాది దంపతులను
            నమ్మికొలుచు నట్టి నరుల కెల్ల
            యార్తి తీరి పోవు, హరిని చేరగలరు
            భాగవతము నేర్పు భక్తి మనకు

            రుక్మిణీ కల్యాణం.... నమ్మితి నా మనంబున పద్యం
  ------
శిశుపాల వధ
సప్తమ స్కంద... కామోత్కంట గోపికల్ పద్యం

4. ఆ:     ఎవ్వరెట్టి పగిది ఏర్పడ తలచిన
              చెంత చేర్చు కొనెడు చక్రి అతడు
              పాప తిట్టుల శిశుపాలు సుగతిచేర్చె
              భాగవతము నేర్పు భక్తి మనకు

---------------
ధర్మరాజు: ప్రధమ స్కాందము 347 పాద్యము

5 . ఆ:     ఎవరు చెంత నుండ ఏలికత్వము దక్కు
              ధర్మ విజయము నకు దారి దొరకు
              ధర్మరాజు కెవరు ధర్మ మార్గము చూపె
              భాగవతము నేర్పు భక్తి మనకు

-------------------

అర్జునుడు: ప్రధమ స్కాందము 367 పద్యము

6. ఆ:  మరిది పార్థు చూడ  మన్నన చేయును
            బుద్ది సెప్పు వేళ  బోద్ధ యతడు
           మంత్ర మాన తిచ్చు మంత్రియై యని వేళ
             భాగవతము నేర్పు భక్తి మనకు
--------------------------
పరీక్షిత్: ప్రధమ స్కాందము
7. ఆ:     చక్రి చింత సేయు అల పరీక్షిత్తుడు
               వినుచు నుండు దగిలి విష్ణు కధలు
              మనువు కాదు నిజము మరణంబు నిజమని
              భాగవతము నేర్పు భక్తి మనకు
---------------------
8. ద్వితీయ స్కంధం... ఖట్వాoగు మోక్ష ప్రకారము
     ఆ:: రెండు ఘడియ లైన, లక్ష్మీపతినుడువ
            బంధనములు వీడె భయము పోయె
            కీర్తనంబొసగెను ఖట్వాo గు మోక్షము
             భాగవతము నేర్పు భక్తి మనకు
----------------------
9 .ప్రహ్లాద చరితము 

సంస్కరించు కున్న సద్బుద్ధి శక్తియై ( తో)
భక్తి కలిగి యున్న భయము లుడుగు
పరమ పధము చూపు ( చేర్చు) ప్రహ్లాద చరితము 
భాగవతము నేర్పు భక్తి మనకు
-----------------------------------------
10. బలి చక్రవర్తి

       ఆడి తప్పననుచు అంత్యమేదైనను
       దాన నిరతి జూపె ధర్మ మరసి
       ధనము రాజ్య ములకు ధర్మంబు విడరాదు
       భాగవతము నేర్పు భక్తి మనకు
-------------------------------------

No comments:

Post a Comment