ప: అందరినీ దూరముంచి ఆనంద నిలయాన
ఎందుకింత ఏకాంతము ఏడు కొండల స్వామి
చ1:
విసుగును పుట్టించానా వింత విన్నపాలతో
కసురు కోకు మయ్యా నీ కన్న బిడ్డల మేము
ముసి ముసి నవ్వుల మోము ముదమార చూడకుండ
నిసి భీతి నెన్ని నాళ్ళు నెరప మందు వయ్యా
చ2:
తిరుమల కెళ్లా మంటూ తల ఎగరేయుటే గానీ
సరియైన భక్తి నింకా సాధింప లేదయా
వరముల నెన్నో పొంది విర్రవీగుటే గానీ
పరిపూర్ణ విశ్వాసము పరిచయమే లేదయా
చ3:
నీవు నా వాడవని నా మాటే విందువని
కావరములు పెంచుకొని కాసుల నిను పంచుకొని
దేవ దేవుడని మరచి దయాగుణము విధి విడచి
భావాహంకారముతో భాద్యత ను విడిచామే
చ4:
ఇకనైనా హిత బుద్ధితో ఇంట కొలుచు కుందుము
సకలము నీవని ఎరిగి సమ భావన సేతుము
నాకే అంతయు అనక నలుగురికీ ఇత్తుము
ఏక వేంకటేశునే ఎదలో పరికింతుము
భజన:
పాహి వేంకటేశుడా పాపము తొలగించుము
పాహి వేంకటేశుడా ప్రాణముల నిలబెట్టుము
పాహి వేంకటేశ్వరా ప్రజలను రక్షింపుము
పాహి వేంకటేశ్వరా ప్రకృతి బాట నడుపుము... స్వస్థత చేకూర్చుము
ఎందుకింత ఏకాంతము ఏడు కొండల స్వామి
చ1:
విసుగును పుట్టించానా వింత విన్నపాలతో
కసురు కోకు మయ్యా నీ కన్న బిడ్డల మేము
ముసి ముసి నవ్వుల మోము ముదమార చూడకుండ
నిసి భీతి నెన్ని నాళ్ళు నెరప మందు వయ్యా
చ2:
తిరుమల కెళ్లా మంటూ తల ఎగరేయుటే గానీ
సరియైన భక్తి నింకా సాధింప లేదయా
వరముల నెన్నో పొంది విర్రవీగుటే గానీ
పరిపూర్ణ విశ్వాసము పరిచయమే లేదయా
చ3:
నీవు నా వాడవని నా మాటే విందువని
కావరములు పెంచుకొని కాసుల నిను పంచుకొని
దేవ దేవుడని మరచి దయాగుణము విధి విడచి
భావాహంకారముతో భాద్యత ను విడిచామే
చ4:
ఇకనైనా హిత బుద్ధితో ఇంట కొలుచు కుందుము
సకలము నీవని ఎరిగి సమ భావన సేతుము
నాకే అంతయు అనక నలుగురికీ ఇత్తుము
ఏక వేంకటేశునే ఎదలో పరికింతుము
భజన:
పాహి వేంకటేశుడా పాపము తొలగించుము
పాహి వేంకటేశుడా ప్రాణముల నిలబెట్టుము
పాహి వేంకటేశ్వరా ప్రజలను రక్షింపుము
పాహి వేంకటేశ్వరా ప్రకృతి బాట నడుపుము... స్వస్థత చేకూర్చుము
No comments:
Post a Comment