కార్తీక "కంద" పద్యాలు .. మొత్తం తిధులు , వీలున్నన్ని శివ నామాలు వచ్చేలాగా...
5 శ్రీ పంచారామ క్షేత్రాలను స్పుశించాను
31 పద్యాలు పూర్తి అయ్యాయి.... శివోహం....
1. క:హర హర యనుచును మునుగగ
విరిసీ విరియని కమలము వికసించెనదే
అరయగ పాడ్యమి తానము
హరియించును పాతకములు హరశివ శంభో
-----------------
ముదముగ వడ్డించె రుచులు, మురహరు నకునున్
మది యాదర చెలువములను
మధువైరి యెసగె గిరిజకు, మరుగణ విభుఁకున్
---------------------
3. క:కార్తీక తదియ దినమున
నార్తి ని కొలువంగ నిన్ను నాశలు తీరున్
స్ఫూర్తివి మంగళ మూర్తివి
కర్తవ్యపు మార్గ మిమ్ము కైవల్యముకున్
-----------------------
కమ్మని చక్కెరపు పాలు కలుగున బోసే
కొమ్మల సౌభాగ్య మొసగ
నమ్మితి నాగుల చవితికి, నాగేంద్రు మదిన్
కంటికి ఇంపుగ చవితిని కార్తీకమునన్
వింటిని నీ కధ మును ము/క్కంటీ ! తింటివి గరళము గళ నీల మణీ
పంచమి పూటను కొలిచెద, పరమేశ్వరనిన్
మించిన దేవర లేడిక
పంచన చేరిన జనులకు పరమం బొసగున్
పురుషోత్తము పొద్దుగొల్చి పూజా విధులన్
హరి దామోదరు డనుచును
సరి సాలగ్రామమిడుము, షష్టీ తిధినన్
కురియగ నీ శిరము మీద, కుముద దళాక్షా
సరి సరి నటనల సామిని
సరియగు రీతుల కొలుతును, సప్తమి రోజున్
తాపస మందార నీకు,తరళాయాక్షీ
శాపము పాపము బాపుము
యాపద తొలగించు మాకు, యష్టమి తిధినన్
కులికెను విఘ్నేశ్వరుండు, కుడుముల తోడన్
తలపున తలచిన మంచిని
నలుగక తీర్చుము నవమిని, నతి శీఘ్రముగా
వడి వడి గా మాదు నారు, వర్గాధమముల్
యడిగెద నినునే దశమిని, యభయము నిమ్మా
పరి పరి విధముల కొలువుము పరమేశ్వరునిన్
నరులకు సురలకు గురువును
నిరతము వేడెద కపర్ది నేకా దశమిన్
శ్రీ పంచారామ క్షేత్రం (1)
క్షీరాబ్ది ద్వాదశమికి, క్షీరాదులచే
మారేడు దళముల సుమము
లారాధింప మదిగోరె, లలితా విభునిన్
శ్రీ పంచారామ క్షేత్రం (2)
సాక్షాత్కారా త్రయోదశ మికి వర విరూ /పాక్షా విభు వినిపించుము
మోక్షా పేక్షా వినతిని, ముముక్షు వులకున్
శమసేయును పాతకములు, చాముండిక తో
సమయమిది చతుర్దశమి ని
తమ తమ విభముల కొలువుము, తామస హరునిన్
తారాకాంతుల వెలిగెను, తగనమ వాసన్
సోముని క్షీణతను వృద్ధి, సూచించు నిటన్
చ:
అలరుల బిల్వ పత్రముల, అర్చన సేయగ లింగ మూర్తికిన్
తలపుల నున్న పాపములు, ధారల నీరుగ జారి పోవగన్
నిలిచెను ఆత్మ రూపమది,నీవును నేనును ఏక మవ్వగన్
మన్నన సేయుము భవాయ, మహ దేవాయా
వెన్నెల నీ పై కురియగ
కన్నులు చాలవు కనుగొన, ఖట్వాoగాయా
మరణించిన వారు నిన్ను మరలా చేరున్
మరుభూమిని నీ వుండగ
మరణపు భయమేల మాకు మనసున రుద్రా?
సంకట నాశక భవహర సత్యపు లింగం
అంకుశ శూల పినాకము
శంకర వరహస్త మందు, శాశ్వత రూపం
మనుచును, కనలేని వాని, "మౌనముని" వై , నా
వనజనులను కని , కూనని
మనమున యనుకుని " ఘన ముని" , మన్నన గనుమా
తనువు, ధనము నాదని అనుకుంటూ జీవిస్తూ.."మౌనముని" అయిన శివా నిను చూడలేని...వన జనులు... అంటే అడవి మనుషులు...లను చూసి...పోనీలే కూన అంటే పిల్లలు ..అనుకుని..."ఘన ముని" మునులందరికీ పెద్ద ముని యైన శివా... నీవు ప్రేమతో, కరుణ తో చూడు...
----------------------------------------------------------------------------------------------------
శివునితో... ప్రశ్నోత్తర ..పద్యం..
21. క: ఎందుంటివి ? నీయందే!
విందో? మనమున వదలని వేత్తి! శివా.. నీ
డెందము నందెవ్వరయా?
అందరినీ గాచు గౌరి, అర కాయధరీ !!
----------------------------------------
లేవంటే శవ మగునిక, లేలయ గుండే
బావుంటే నిను జేర్చే
తోవంటే నా పయనము, తోయజ నేత్రా
----------------------------------------
23. క: కుసుమించిన సుమ శిశువుల
పసి వయసుల వనము కాదె, పరమ శివం తం
వసి వాడని చిరు నగవుల
ముసిముసి మోముల ను చూడ, ముదమగు లాస్యం
----------------------------------------
24. క:విభవము కొలదీ తేనెల
యభిషేకించెద హరునకు యద్రిజ పతికిం
ప్రభలపు గాత్రము కలుగని
నభయము నొసగెను పశుపతి,నటరాజుడిటన్
----------------------------------------
25. క: నారాయణీ ప్రియ హరుని
పారాయణ జప తపముల, ప్రార్ధన లిడగా
తారాపతి శేఖర వర
ధారామృతము దొరికెను, తత్ఫలితముగా
----------------------------------------
బసవుని మూపురమునెక్కి, పశుపతి నీవే
మసలెదవట సంధ్య ను,
యిరుదెసలను రుద్ర గణ మమర, యీభూతలమున్
త/రంగా మంగళములిడు హరా రుద్రాయా
శృంగీనందీచండీ
భృంగీప్రమధగణ సేన, ఘృష్ణేశాయా
----------------------------------------
28. క: కరమున పినాక ధనువును
వరముల గిరిజా రమణియు, వామాంకమునన్
సురుచిర శిపివిష్టాయా
సురముని వందిత హరహర, సుందర రూపా
----------------------------------------
29. క: అన్నాతికి నీ సగమటకన్నప్పను కాచితి వట కందర్పహరా
నిన్నే నమ్మితి శర్వా
నన్నూ నీతోవ నడుపు, నగరేశాయా !!
---------------------
30. క: మదినెపుడును నిను తలతును
ముదమున వినియెద కధలను, మునిగణ ములచే
వదలను శివ చరణములను
పదిలముగను పరమ పదము, పశుపతి నిడుమా
ఈ పద్యం లో విశేషం ఏమిటంటే.. అన్ని లఘువులే వుంటాయి.. ఛందస్సు కోసం రెండు గురువులు..ఉంటాయి... రెండు మరియు నాలుగు పాదాలలో చివరన
----------------------------------------
31. క: రవిచంద్రులు నీ కనులటసవితృ మండలము కాచు, సర్వేశాయా
అవిరళ వరముల నొసగెడు
శివ శివ కరుణాబ్ది యీశ , శివ శివ శంభో
శివోహం....
శివోహం....
శివోహం....
No comments:
Post a Comment