జిజ్ఞాస కలవారికి విజ్ఞాన శాస్త్రం

 పల్లవి: 

జిజ్ఞాస కలవారికి సుజ్ఞాన నేత్రం
ప్రజ్ఞా పాటవ మోసగే విజ్ఞాన శాస్త్రం

చరణం 1::
మంచిదైన ఆలోచన మనసు మధన చేయురా...
మనిషికి ఉపయోగమైన ప్రయోగముగా మారురా...

సాధన చేయుట లోనే విజయము దాగుందిరా...
సాధ్యము కానిది లేదు..సాహసాన సాగరా...


చరణం 2::
CNR రావు గారు, అబ్దుల్ కలాం గారు
CV రామన్ వంటి దార్శనీకులెందరు...
వేదాల ఋషులను మనము చూడలేదురా...
ఈనాటి శాస్త్రవేత్త వారి రూపమే నురా..

No comments:

Post a Comment